
సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఎవరితో చేస్తాడన్న కాం ఫ్యూజన్ నిన్నటివరకు ఉంది. వంశీ పైడిపల్లి కాంబోలో సినిమాకు రెడీ అవుతున్నట్టు వార్తలు రాగా.. అతను చెప్పిన కథ నచ్చని మహేష్ వంశీ పైడిపల్లిని పక్కన పెట్టాడని తెలుస్తుంది. ఇక కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న పరశురామ్ సినిమానే కన్ఫర్మ్ చేశాడట మహేష్. మహేష్ తోనే తన సినిమా అని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు పరశురామ్.
మహేష్ ఒక్కడు సినిమా చూసి స్ఫూర్తి పొంది సినిమా పరిశ్రమలోకి వచ్చానని.. ఆయన్ను డైరెక్ట్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు వెళ్లడించారు పరశురామ్. ఒక అద్భుతమైన కథతో మహేష్ సినిమా వస్తుందని.. ఇన్నాళ్లు తన సినిమాల్లో ఎలివేషన్ సీన్స్ రాయలేదని.. కానీ మహేష్ కోసం అది ప్రయత్నిస్తా అంటున్నాడు పరశురామ్. నిఖిల్ యువత సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా పరశురామ్ గీతా గోవిందంతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా రిలీజై రెండేళ్లు అవుతున్నా పరశురామ్ చేస్తే స్టార్ తో సినిమా చేయాలని వెయిట్ చేయక తప్పలేదు.