బాలీవుడ్ ఛాన్స్ పట్టేసిందా..!

తెలుగు తమిళ భాషల్లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న అమలా పాల్ డైరక్టర్ విజయ్ ను ప్రేమించి పెళ్లాడటం.. రెండేళ్లకే వారు డైవర్స్ తీసుకోవడం కూడా జరిగింది. పెళ్ళికి ముందు సూపర్ ఫామ్ లో ఉన్న అమలా పాల్ పెళ్లి తర్వాత  అందుకోలేదు. తమిళ, కన్నడ భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేస్తున్నా పెద్దగా లాభం లేకుండా ఉంది. అందుకే అమలా పాల్ కన్ను బాలీవుడ్ వైపు మళ్లింది. ఎలాంటి ఛాన్స్  చేసేందుకు నేను రెడీ అని చెబుతున్న ఈ అమ్మడికి బాలీవుడ్ నుండి లక్కీ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. అక్కడ వచ్చింది సినిమా ఛాన్స్ కాదట వెబ్ సీరీస్ ఛాన్స్ అట. మహేష్ భట్, జియో స్టూడియోస్ కలిసి నిర్మించే వెబ్ సీరీస్ లో అమలా పాల్ కు ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. 

బాలీవుడ్ లో వెబ్ సీరీస్ లకు మంచి క్రేజ్ ఉంటుంది. అక్కడ హీరోయిన్స్ వెబ్ సీరీస్ లను కూడా చేస్తూ బీ టౌన్ ఆడియెన్స్ ను అలరిస్తారు. ప్రస్తుతం బాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న కియారా అద్వానీ కూడా ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే వెబ్ సీరీస్ లలో అదరగొడుతుంది. లస్ట్ స్టోరీస్, గిల్టీ లాంటి వెబ్ సీరీస్ లతో కియరాకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మరి అమలా పాల్ అది మహేష్ భట్ ప్రొడక్షన్ లో వెబ్ సీరీస్ అంటే కచ్చితంగా ఈ వెబ్ సీరీస్ తర్వాత అమలా బాలీవుడ్ లో బిజీగా మారే అవకాశం తప్పక ఉంటుందని చెప్పొచ్చు.