పూర్తి కథ వినకుండానే 'సింహా' చేశారా..!

నందమూరి బాలకృష్ణ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా సినిమా సింహా. బోయపాటి శ్రీను డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 2010 ఏప్రిల్ 30న రిలీజయింది. అంటే సరిగ్గా ఈరోజుకి ఆ సినిమా వచ్చి పదేళ్లు అవుతుంది. వరుస ప్లాపులతో హిట్ ట్రాక్ పూర్తిగా తప్పిన బాలకృష్ణకు బోయపాటి శ్రీనుతో సినిమా చేయాలని అనిపించడంతోనే బాలయ్య బోయపాటికి ఫోన్ చేశారట. ఆ టైం లో విజయవాడ పెళ్ళికి వచ్చిన బోయపాటి తిరిగి హైదరాబాద్ వెళ్ళాక బాలకృష్ణను కలిశారట. 

తనకు సూట్ అయ్యే కథ చెప్పమని అడిగితే.. కేవలం 24 నిమిషాలు కథ చెప్పడంతో బాలయ్య సింహా సినిమాను ఓకే చేశారట. సినిమా లైన్ చెప్పి పూర్తి న్యారేషన్ ఇస్తున్న టైంలోనే మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పారట బాలయ్య బాబు. అలా చేసిన సింహా మళ్ళీ బాలకృష్ణ సత్తా ఏంటో చూపించింది. నందమూరి ఫ్యాన్స్ ఆకలి కూడా తీర్చింది. ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను మళ్ళీ లెజెండ్ సినిమాతో కూడా హిట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు కలిసి హ్యాట్రిక్ మూవీ చేస్తున్నారు.