నాగ చైతన్యతో విక్రమ్ కుమార్ 'థ్యాంక్యూ'

లాస్ట్ ఇయర్ మజిలీ, వెంకీ మామ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవడం విశేషం. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య విక్రమ్ కుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆల్రెడీ మనంతో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబో మళ్ళీ కలిసి పనిచేయనున్నారు.   

విక్రమ్ కుమార్ కథ చెప్పడం ఆ స్టోరీని చైతు ఒకే చేయడం అంతా జరిగిందట. లవ్ స్టోరీ చివరి దశకు చేరుకోగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. ఈ సినిమాకు థ్యాంక్యూ టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తుంది. దాదాపు ఇదే టైటిల్ కన్ఫర్మ్ చేస్తారని అంటున్నారు. లాస్ట్ ఇయర్ నానితో గ్యాంగ్ లీడర్ సినిమా చేసినా విక్రమ్ కుమార్ ఆ సినిమాను కమర్షియల్ హిట్ గా మలచడంలో విఫలమయ్యారు. మరి నాగ చైతన్యతో చేస్తున్న ఈ సినిమా అయినా సూపర్ హిట్ కొడుతుందో లేదో చూడాలి.