
సంగీతానికి ఎల్లలు లేవు.. భాషతో సంబంధం ఉండదు. బాహుబలి సాంగ్స్ ప్రపంచ దేశాల్లో వినపడుతుంటే సంబరపడ్డాం. ఇక లేటెస్ట్ గా మరో సాంగ్ అంతటి ఆదరణ పొందింది. అక్కడ ఇక్కడ కాదు ఏకంగా ఆస్ట్రేలియా క్రికెటర్ ను సైతం స్టెప్పులేయించేలా చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇద్దరు కలిసి చేసిన మ్యాజిక్ అల వైకుంఠపురములో. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.
చిత్రంలోని సామజవరగమన, బుట్టబొమ్మ సాంగ్స్ సంగీత ప్రియులను అలరించాయి. బుట్టబొమ్మ సాంగ్ కు కొందరు సెలబ్రిటీస్ సైతం డ్యాన్స్ వేశారు. లేటెస్ట్ గా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా తన భార్యతో కలిసి బుట్టబొమ్మ సాంగ్ కు స్టెప్పులేశారు. ఆ వీడియోని టిక్ టాక్ లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. సంగీతానికి భాషతో సంబంధం లేదు అని చెప్పడానికి ఇదో చక్కని ఉదాహరణ. అర్ధం తెలియకపోయినా సరే ఆ మ్యూజిక్ నచ్చి స్టెప్పులేస్తున్న వార్నర్ జోడీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.