అర్జున్ రెడ్డి డైరక్టర్ కు విజయ్ రిక్వెస్ట్..!

విజయ్ దేవరకొండని స్టార్ ను చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సందీప్ వంగకు విజయ్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. కరోనా క్రైసిస్ లో నిత్యావసరాలకు ఇబ్బంది పడుతున్న వారికి దేవరకొండ ఫౌండేషన్ స్థాపించి వాళ్ళ అవసరాలకు తగినట్టుగా విరాళాలు అందిస్తున్నారు. విజయ్ చేస్తున్న ఈ మంచి పని గురించి తెలుసుకున్న సందీప్ వంగ విజయ్ ను ప్రశంసించాడు. 

సందీప్ వంగా మెసేజ్ కు రిప్లై గా 'ఐ మిస్ యూ' వంగా.. ఈ లాక్ డౌన్ టైంలో 2, 3 స్క్రిప్టులు పూర్తి చెయ్.. నీతో కలిసి పనిచేయడానికి రెండేళ్ల వాయు వెయిట్ చేయలేను అని అన్నాడు విజయ్ దేవరకొండ. విజయ్ కెరియర్ లో అర్జున్ రెడ్డి మొదటిస్థానంలో ఉంటుందని చెప్పొచ్చు. సందీప్ వంగ డైరక్షన్ టాలెంట్ విజయ్ నటన సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టాయి. ఈ క్రేజీ కాంబినేషన్ లో మరో సినిమా వస్తే మాత్రం అంచనాలు తారాస్థాయిలో ఉంటాయని చెప్పొచ్చు.