ఇస్మార్ట్ శంకర్ 100 మిలియన్ వ్యూస్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా రామ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కరెక్ట్ గా మాస్ సినిమా చూసి చాలా రోజులవుతుందని ఫీల్ అవుతున్న తెలుగు ప్రేక్షకులకు కరెక్ట్ టైం లో కరెక్ట్ సినిమాగా ఇస్మార్ట్ శంకర్ వచ్చింది. ఇక ఈ సినిమా తెలుగులోనే కాదు హిందీలో కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ మూవీ హిందీ డబ్బింగ్ వర్షన్ ఫిబ్రవరిలో యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.

తెలుగులోనే కాదు హిందీ వర్షన్ కూడా క్రేజీ వ్యూస్ సాధించింది. హిందీ డబ్బింగ్ వర్షన్ కు 100 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. తెలుగు సినిమాలు బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఏర్పడింది. అల్లు అర్జున్ సరైనోడు డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో దుమ్ముదులిపేసింది. ఇక్కడ సూపర్ హిట్టైన సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. అయితే రీమేక్ కు వీలుకాని సినిమాలు మాత్రం డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ సినిమాలకు హిందీలో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇస్మార్ట్ శంకర్ 100 వ్యూస్ సాధించింది.. చూస్తుంటే ఈ సినిమా ఇంకా వ్యూస్ సాధించేలా ఉంది.