
సీనియర్ స్టార్ హీరోలంతా వరుస సినిమాలతో బిజీగా ఉంటే అక్కినేని నాగార్జున మాత్రం చాలా వెనుకపడ్డారు. సోగ్గాడే చిన్ని నాయనా తర్వాత ఒక్క సూపర్ హిట్ కూడా లేని నాగార్జున ప్రస్తుతం సోల్మన్ డైరక్షన్ లో వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయిందని తెలుస్తుంది. ఇక ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా షూటింగ్ మొదలుపెట్టే నాగ్ ఈసారి మాత్రం సినిమా సినిమాకు గ్యాప్ ఇవ్వాలని చూస్తున్నారట. అంతేకాదు కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారని తెలుస్తుంది.
ఈమధ్యనే నాగార్జున 50 కథల దాకా విన్నారట కానీ వాటిల్లో కేవలం 5 స్టోరీస్ మాత్రమే నచ్చాయట.. ఆ 5 స్టోరీస్ లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాలట. ఒకప్పుడు ప్రయోగాలకు పెద్దపీట వేసే నాగార్జున ఇప్పుడు 50 కథలు విని వాటిలో 4,5 సెలెక్ట్ చేయడం విచిత్రంగా ఉందని అంటున్నారు. అందులో సీనియర్ డైరక్టర్స్ చెప్పిన కథలను కూడా నాగార్జున పక్కన పెట్టేశాడని అంటున్నారు. మరి నాగార్జున నెక్స్ట్ సినిమా ఏదవుతుంది. ఆ లక్కీ ఛాన్స్ ఎవరు అందుకున్నారో తెలియాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.