తేజ కూడా రూట్ మారుస్తున్నాడా..!

కొన్నాళ్లుగా కెరియర్ లో సక్సెస్ లు లేక చాలా వెనుకపడ్డ డైరక్టర్ తేజ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. అయితే ఆ తర్వాత  సీత సినిమా మళ్ళీ తేజకు ప్లాప్ ఇచ్చింది. ఈమధ్యనే రానా, గోపీచంద్ హీరోలుగా రెండు క్రేజీ మూవీస్ ఎనౌన్స్ చేసిన తేజ లేటెస్ట్ గా అమెజాన్ ప్రైమ్ తో ఒక భారీ డీల్ సెట్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఈమధ్య తెలుగులో వెబ్ సీరీస్ లకు డిమాండ్ పెరుగుతుంది కాబట్టి తేజ కూడా అటు వైపు అడుగులేసే ఆలోచనలో ఉన్నాడట. 

అమెజాన్ ప్రైమ్ వారు తేజ డైరక్షన్ లో మూడు వెబ్ సీరీస్ లు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. దానికి సంబందించిన అగ్రిమెంట్ కూడా పూర్తయిందని టాక్. ఇప్పటికే డైరక్టర్ క్రిష్ ఆహా కోసం వెబ్ సీరీస్ లను నిర్మిస్తున్నాడు. ఈమధ్యనే హాట్ స్టార్ తో క్రేజీ డీల్ సెట్ చేసుకున్నాడట క్రిష్ ఇప్పుడు అతని దారిలోనే తేజ కూడా వెబబ్ సీరీస్ ల మీద ద్రుస్తి పెడుతున్నాడని తెలుస్తుంది.