
మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ఆచార్య కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా ముందు త్రిషని తీసుకోవాలని అనుకోగా ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. స్వీటీ అనుష్కని తీసుకోవాలని అనుకున్నారు కానీ ఆమె కూడా కొన్ని కారణాల వల్ల ఒప్పుకోలేదట. ఫైనల్ గా మళ్ళీ ఖైదీ నంబర్ 150 హీరోయిన్ కాజల్ కే ఓటు వేశారని తెలుస్తుంది.
చిరు 150లో జోడీ కట్టిన ఈ అమ్మడు మరోసారి మెగా ఛాన్స్ పట్టేసిందని అన్నారు. అయితే కాజల్ కూడా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయడం కష్టమని చెబుతుందట. లాక్ డౌన్ వల్ల డేట్స్ అడ్జెస్ట్ చేయడం కష్టమని చెబుతుందట. ఆల్రెడీ ఈ ఇయర్ సెకండ్ హాఫ్ మొత్తం తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ సినిమాకు ఇచ్చేసిందట కాజల్ అందుకే ఆచార్య నుండి ఆమె ఎగ్జిట్ అవుతుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో చిత్రయూనిట్ వెళ్లడించాల్సి ఉంది.