
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ లేటెస్ట్ గా స్టార్ట్ చేసిన ఆహా ఓటిటి యాప్ సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. లాక్ డౌన్ టైం లో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ తో పాటుగా ఆహాని ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే సబ్ స్క్రైబర్స్ కూడా పెరిగినట్టు తెలుస్తుంది. ఓటిటిలో ఆహాని నంబర్ 1 ప్లేస్ లో నిలబెట్టేందుకు తన ప్రయత్నం చేస్తున్నారు అల్లు అరవింద్. ఇందులో భాగంగా ఆహా కోసం 20 వెబ్ సీరీస్ లను నిర్మిస్తున్నారట.
అల్లు అరవింద్ నిర్మాణ సారధ్యంలోనే ఈ వెబ్ సీరీస్ లు వస్తాయని తెలుస్తుంది. న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేసేలా ఈ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నారు అల్లు అరవింద్. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లకు ఏమాత్రం తగ్గకుండా ఆహా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అల్లు అరవింద్ స్కెచ్ వేశారు అంటే అది కచ్చితంగా వర్క్ అవుట్ అయ్యి తీరుతుంది. ఆహా ఇప్పటికే ఆడియెన్స్ ను ఆహా అనిపిస్తుండగా ఈ సరికొత్త స్టఫ్ తో ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేస్తుందని చెప్పొచ్చు.