
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (53) మృతి చెందారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ముంబై కోకిలాబెన్ హాస్పిటల్ లో ఐసియులో చికిత్ర పొందుతూ మరణించారు. క్యాన్సర్ తో బాధపడుతున్న బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. బాలీవుడ్ విలక్షణ నటులలో ఒకరైన ఇర్ఫాన్ ఖాన్ టివి సీరియల్స్ ద్వారా కెరియర్ ప్రారంభించి సినిమాల్లో స్టార్ గా ఎదిగారు.
దాదాపు హిందీలో 100 సినిమాలకు పైగా సినిమాలు చేసిన ఇర్ఫాన్ ఖాన్ ఎలాంటి పాత్ర చేసినా తన ముద్ర వేసుకుంటూ వచ్చారు. బాలీవుడ్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ సినిమాల్లో కూడా ఇర్ఫాన్ ఖాన్ నటించారు. అమేజింగ్ స్పైడర్ మ్యాన్, జురాసిక్ వరల్డ్ సినిమాల్లో కూడా ఇర్ఫాన్ నటించి మెప్పించారు. 2018లో ఆయన న్యూరోఎండోక్రిన్ ట్యూమర్ తో బాధపడుతున్న వెళ్లడించారు. దానికి సంబందించిన ట్రీట్ మెంట్ లండన్ లో తీసుకున్నారు. ఈమధ్యనే తల్లి మరణ వార్త విని మరింత క్రుంగి పోయిన ఆయన తల్లి అంతిమ సంస్కారానికి వెళ్లలేదని బాధపడ్డారు. తల్లితో పాటే తాను కూడా అనుకుంటూ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు ఇర్ఫాన్ ఖాన్. ఆయన మరణ వార్త విని బాలీవుడ్ పరిశ్రమ షాక్ కు గురైంది.