
నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సిద్ధార్థ్ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో కెరియర్ కొనసాగించలేడు. తెలుగులో దాదాపు కెరియర్ అటకెక్కేసిన ఈ హీరో తమిళంలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. అక్కడ చేసిన సినిమాలే ఇక్కడకు డబ్ అవుతున్నాయి. ఎన్టీఆర్ తో బాద్షా సినిమాలో ఒక చిన్న పాత్ర చేసిన సిద్ధార్థ్ తెలుగులో డైరెక్ట్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే ఆ లక్కీ ఛాన్స్ మహా సముద్రం రూపంలో వచ్చిందని తెలుస్తుంది.
ఆరెక్స్ 100 డైరక్టర్ అజయ్ భూపతి సెకండ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమా మహా సముద్రం. శర్వానంద్ హీరోగా తెరకెక్కే ఈ సినిమాలో సిద్ధార్థ్ సెకండ్ హీరోగా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా కథ పట్టుకుని చాలామంది హీరోల దగ్గరకు తిరిగాడు అజయ్ భూపతి. కథని మార్చమని కొందరు.. ఇచ్చిన బడ్జెట్ లో చేయమని మరికొందరు ఇలా రకరకాల కారణాలు చెప్పి టైం పాస్ చేశారు. ఫైనల్ గా శర్వానంద్ తో ఈ సినిమా ఓకే చేసుకున్నాడు. ఈ సినిమాలో సిద్ధార్థ్ నటించడం కూడా సినిమాపై అంచనాలు పెంచింది. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ స్టోరీతో ఈ సినిమా వస్తుందని అంటున్నారు. మరి శర్వానంద్, సిద్ధార్త్ చేస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.