
కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో సూపర్ ఫామ్ లో ఉంది. ఈ ఇయర్ ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇదే కాకుండా తెలుగులో మరో రెండు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం లాక్ డౌన్ టైంలో ఇంట్లో ఉంటున్న రష్మిక తన ఫ్యాన్స్ తో స్పెషల్ చిట్ చాట్ చేసింది. అందులో ఒక క్రేజీ ఫ్యాన్ నీకు భర్తగా నన్ను చేయమని దేవుడిని అడుగుతా అని అనగా.. దానికి సమాధానంగా రష్మిక ముందు ఇతన్ని అడుగు అంటూ తన పెంపుడు కుక్క బొమ్మ పెట్టింది రష్మిక.
ఇంట్లో తనతో పాటుగా చాలా పెట్స్ ఉంటాయని చెప్పింది రష్మిక.. మీరు సినిమాలు మీరు చూస్తారా అంటే అంత టైం ఉండదని అన్నది. ఇక విజయ్ దేవరకొండ, నితిన్ లలో ఎవరంటే ఇష్టమని అడుగగా. ఆ ప్రశ్నని స్కిప్ చేసింది రష్మిక. ఇక తన బెడ్ రూమ్ చూపించాలని ఒక అభిమాని అడిగితె అది తన ప్రయివేట్ ప్లేస్ అని సమాధానం ఇచ్చింది. తెలుగులో సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్న రష్మిక మరో ఐదారేళ్ళ ఇదే ఫామ్ కొనసాగించేలా ఉంది.