
మహానటి సావిత్రి బయోపిక్ లో అద్భుతమైన నటనతో మెప్పించిన కీర్తి సురేష్ త్వరలో దర్శక నిర్మాత విజయ నిర్మల బయోపిక్ లో కూడా నటిస్తుందన్న వార్తలు వచ్చాయి. ఈ న్యూస్ విజయ నిర్మల తనయుడు నరేష్ దాకా వెళ్లడంతో ఆయన స్పందించడం జరిగింది. అమ్మ జీవిత కథ సినిమాగా వస్తుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. అయితే అమ్మ బయోపిక్ ఆలోచన ఉందని దానికి సంబందించిన కథ తానె సిద్ధం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు నరేష్.
ఆమె జీవిత కథతో సినిమా చేయాలంటే మా పర్మిషన్ ఉండాల్సిందే.. అలాంటిది అసలు తమ ద్వారా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాకుండానే వార్తల్లో రావడం గురించి అసంతృప్తి వెల్లడించారు నరేష్. అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తారో తెలియడం లేదని అన్నారు నరేష్. ఇక అమ్మ బయోపిక్ ను మీరే డైరెక్ట్ చేస్తారా అంటే ఆమె నటి, దర్శకురాలు, నిర్మాత, గిన్నీస్ బుక్ రికార్డు కూడా అందుకున్నారు. ఆమెలో ఇంకా చాలా కళలు ఉన్నాయి. వాటి గురించి పూర్తిస్థాయిలో పరిశోధన చేసి సినిమా తీయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మేం ఎవరికీ అనుమతి ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు నరేష్.