మనవరాలితో చిరు హంగామా..!

సోషల్ మీడియా వల్ల స్టార్స్ తమ ఇంట్లో  చేసే పనులు కూడా మనకు తెలుస్తున్నాయి. అభిమానించే  హీరో  గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో తెలుసుకోవాలని అనిపిస్తుంది.  ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ బ్లాగ్స్ తో అది నెరవేరుతుంది. వాళ్ళ రెగ్యులర్ అప్డేట్స్ తో పాటుగా అప్పడప్పుడు అభిమానులతో చాట్ చేయడం కూడా చేస్తుంటారు. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్, ఇన్ స్ట్రా గ్రామ్ ఇచ్చారు. ప్రతిరోజూ ఏదో ఒక విషయాన్ని  బ్లాగ్ లో చెబుతూ వస్తున్నా చిరంజీవి లేటెస్ట్ గా మానవరాలుతో ఆడుకుంటున్న వీడియో షేర్ చేశారు. 

శ్రీజ, కళ్యాణ్ దేవ్ ల పాప నవిష్కతో చిరు సోఫాలో కూర్చుని ఆ బుజ్జి పాపకు కావాల్సిన పాటని అడిగి ఆ సాంగ్ పెడతాడు. ఆ పాత కూడా మీ మీ పాత కావాలని అడుగుతుంది.. ఆ పాత పెట్టడమే ఆలస్యం హుషారుగా గంతులేస్తుంది. ఆమెలోని ఆ ఆనందాన్ని చూసి సంగీతం చాలా గొప్పదని మెసేజ్ పెట్టారు చిరంజీవి. తన సినిమాలతో అలరించిన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తన రెగ్యులర్ అప్డేట్స్ తో మెగా ఫ్యాన్స్ ను మరింత అలరిస్తున్నారు.