నితిన్ తో ప్రియాంకా రొమాన్స్

యువ హీరో నితిన్ భీష్మ సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ మూవీలో కీర్తి సురేష్ తో నితిన్ జోడీ కడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అందాదున్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా గ్యాంగ్ లీడర్ భామ ప్రియాకా అరుళ్ మోహన్ ని ఫైనల్ చేశారని తెలుస్తుంది. 

బాలీవుడ్ లో టబు చేసిన ఈ పాత్రని తెలుగులో రమ్యకృష్ణ చేస్తున్నట్టు సమాచారం. హిందీ వర్షన్ లో ఆయుశ్మాన్ ఖురానా, హీరోయిన్ రాధికా ఆప్టేతో రొమాన్స్ అదరగొడతాడు. మరి ఈ రీమేక్ లో నితిన్ కూడా ప్రియాంకాతో అదిరిపోయే రొమాన్స్ చేస్తాడని అంటున్నారు. గ్యాంగ్ లీడర్ సినిమాలో ప్రేక్షకులను మెప్పించిన ప్రియాంకా అరుళ్ మోహన్ సెకండ్ మూవీ కూడా క్రేజీ హీరోతో నటిస్తుంది. మరి ఈ సినిమా అమ్మడి కెరియర్ కు ఎలాంటి పాపులారిటీ తెస్తాయో చూడాలి.