సూర్యకు నిర్మాతల సపోర్ట్

కోలీవుడ్ హీరో సూర్య తన ప్రొడక్షన్ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మించిన పొన్ మగళ్ వందన్ సినిమా ఓటిటిలో రిలీజ్ చేయడంపై థియేటర్ల యూనియన్ తప్పుబట్టాయి. ఇక మీదట సూర్య సినిమాలకు తాము రిలీజ్ చేయమని సంచలన ప్రకటన చేశారు. అయితే లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూసివేయడం జరిగింది. నిర్మాతగా థియేట్రికల్ రిలీజ్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉన్నా సూర్య ఓటిటిలో రిలీజ్ చేశాడు. అయితే నిర్మాతలు మాత్రం సూర్యకు సపోర్ట్ గా ఉన్నారు. 

సూర్య సినిమాలను థియేటర్లలో ఆడించేది లేదన్న యాజమాన్య సంఘాల ప్రకటనని కొందరు తప్పుపడుతున్నారు. ఐతే సూర్యకు నిర్మాతల మండలి నుండి కూడా సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన పొన్ మగళ్ వందన్ జె.జె ఫెడ్రిక్ డైరెక్ట్ చేశారు. డైరెక్ట్ ఓటిటిలో సినిమా రిలీజ్ చేశారన్న కారణంతో సూర్య మీద థియేటర్ల యాజమాన్య సంఘాలు సీరియస్ గా ఉన్నారు. అయితే ఈ విషయంపై ప్రేక్షకుల నుండి కూడా సూర్యకు సపోర్ట్ వస్తుండటం విశేషం.