
సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత పరశురామ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ మూవీకిసంబందించిన అఫీషియల్ న్యూస్ రాలేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా లవ్ స్టోరీగా రాబోతుందని తెలుస్తుంది. స్టార్ హీరోలు కేవలం లవ్ స్టోరీ అంటే కష్టమే.. కానీ మహేష్ కోసం ఒక అద్భుతమైన లవ్ స్టోరీ రాశాడట పరశురామ్. మెచ్యూర్డ్ లవ్ స్టోరీతో వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రాబోతుందట.
గీతా గోవిందం తర్వాత రెండేళ్లు స్టార్ సినిమా కోసం ఎదురుచూసిన పరశురామ్ ఫైనల్ గా మహేష్ తో కథ ఓకే చేయించుకున్నాడు. సరిలేరు కంటే ముందే పరశురామ్ ఒక కథ వినిపించగా అది మహేష్ కు నచ్చలేదు. అందుకే పరశురామ్ మరో లైన్ వినిపించాడు. మహేష్, పరశురామ్ ప్రాజెక్ట్ మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుందని తెలుస్తుంది.