
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తర్వాత చేస్తున్న సినిమాను క్రిష్ డైరెక్ట్ చేస్తారని తెలిసిందే. ఇప్పటికే ముహూర్త కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా వకీల్ సాబ్ సినిమా రిలీజ్ తర్వాత రెగ్యులర్ షూట్ కు వెళ్తుందని తెలుస్తుంది. పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాను క్రిష్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో తమిళ హీరో శివ కార్తికేయన్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది.
వీడియో జాకీగా కెరియర్ ప్రారంభించి హీరోగా మారి కోలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న శివ కార్తికేయన్ అక్కడ చేసిన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే పవర్ స్టార్ సినిమాతో డైరెక్ట్ గా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు శివ కార్తికేయన్. ఈ సినిమాలో పవన్ దొంగగా కనిపిస్తాడట. ఎన్టీఆర్ బయోపిక్ ప్లాప్ అవడంతో పవర్ స్టార్ సినిమా హిట్టు కొట్టి తన సత్తా చాటాలని చూస్తున్నాడు క్రిష్. ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.