
టైటిల్ చూసి ఏంటి ఇది జరిగే పనేనా అని డౌట్ పడొచ్చు.. ఇలాంటివి చాలా విన్నాంలెండి అని ఒకింత విసుగు కూడా వచ్చేస్తుంది. అసలు ఇద్దరు స్టార్స్ కలిసి నటించడమే ఎక్కువ అనుకుంటుంటే.. ముగ్గురు స్టార్స్ అది కూడా మూడు పెద్ద ఫ్యామిలీ నుండి స్టార్స్ నటిస్తే మాత్రం రికార్డులు బద్ధలవుతాయి. ఇంతకీ ఈ మెగా దగ్గుబాటి అక్కినేని కాంబో సెట్ చేసింది ఎవరు అంటే.. ఇంకెవరు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అని తెలుస్తుంది. ఆయన దర్శకుడిగా 100వ సినిమాను ఈ మల్టీస్టారర్ తీయాలని అనుకున్నారు. కానీ అది కుదరకపోవడంతో గంగోత్రి సినిమా తీశారు.
ఇక ఇప్పుడు మళ్ళీ ఈ మెగా మల్టీస్టారర్ సినిమాపై గురి పెట్టారు రాఘవేంద్ర రావు. మెగాస్టార్ చిరంజీవి. దగ్గుబాటి వెంకటేష్, అక్కినేని నాగార్జున కలిసి ఒక సినిమాలో నటిస్తారని తెలుస్తుంది. మల్టీస్టారర్ కు ఈ ముగ్గురు హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. కథ ఓకే అయితే ముగ్గురు డేట్స్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారట. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య, వెంకటేష్ నారప్ప, నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ కాంబో సెట్ అయితే మాత్రం రికార్డులన్నీ ఈ సినిమా మీదే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.