
ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తి కాగానే కొద్దిపాటి గ్యాప్ తోనే ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా మొదలుకానుదాని తెలుస్తుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు టైటిల్ ఫిక్స్ చేసినట్టు తేలుతుంది. హారిక హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ మూవీ నిర్మిస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన శృతి హాసన్ ని ఫైనల్ చేశారట.
అయితే ఈ మూవీలో ఎన్టీఆర్ తో పాటుగా మరో యువ హీరోకి ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఎన్టీఆర్ తో చేసిన అరవింద సమేత సినిమాలో నవీన్ చంద్ర, అజ్ఞాతవాసిలో ఆది, అల వైకుంఠపురములో సినిమాలో సుశాంత్ ఇలా స్టార్స్ ని డైరెక్ట్ చేస్తూ సినిమాలో ఒక యువ హీరోని పెట్టుకుంటున్నాడు త్రివిక్రమ్. రాబోయే ఎన్టీఆర్ సినిమాలో ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి.