
మంచి మనసు చాటుకునేందుకు స్టార్స్ కానవసరం లేదు.. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోయిన్స్ లాక్ డౌన్ టైం లో బయటకు రాకుండా జాగ్రత్తపడుతుంటే.. బయట ఉన్న వారి కోసం తన వంతు సాయంగా మంచి పనులు చేస్తుంది ప్రణీత. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో బాపు గారి బొమ్మగా కనిపించి అలరించిన ప్రణీత తెలుగులో స్టార్ క్రేజ్ దక్కించుకోలేదు. వచ్చిన ఛాన్స్ చేసుకుంటూ వెళ్తున్న ఈ అమ్మడు కరోనా వల్ల నిత్యావసరాలు లేక ఇబ్బంది పెడుతున్న వారి కోసం హెల్ప్ చేస్తుంది.
ఇప్పటికే 50 కుటుంబాలకు 1000 రూపాయలు చొప్పున లక్షణ్ రూపాయలు ప్రణీత ఫౌండేషన్ ద్వారా విరాళంగా ఇచ్చిన ప్రణీత ఇప్పుడు సొంతంగా ప్రజలకు ఆహారాన్ని అందిస్తుంది. ప్రణీత స్వయంగా ఫుడ్ ప్రిపేర్ చేసి పంచి పెడుతుందని తెలుస్తుంది. ఇప్పటికే లాక్ డౌన్ చేసినప్పటి నుండి 21 రోజుల్లో 75 వేళా ఫుడ్ ప్యాకెట్స్ ఆమె డిస్ట్రిబ్యూట్ చేసిందని తెలుస్తుంది. ముఖానికి మాస్క్ ధరించి ప్రణీత వంట సిద్ధం చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తెలుగులో స్టార్ హీరోలు కూడా చేయని ఈ పని వల్ల ఆమెను అభిమానించే వారి సంఖ్య పెరిగిందని చెప్పొచ్చు.