
రౌడీ హీరో దేవరకొండ కరోనా వల్ల లాక్ డౌన్ టైం లో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం తన వంతు సాయం చేసేందుకు సిద్ధమయ్యాడు. అందరిలా డబ్బులు డొనేట్ చేసి చేతులు దులుపుకోకుండా లాక్ డౌన్ టైంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడుతున్న పోలీసులకు జ్యూస్ అందించిన విజయ్ దేవరకొండ వారు చేస్తున్న పనిని అందరం అభినందించాలి.. వారికి సహకరించాలని కోరారు. అంతేకాదు ఇప్పుడు ఏకంగా ఒక ఫౌండేషన్ ను ఏర్పాటు చేశాడు.
అవసరం ఉన్న వారు అవసరానికి ఆదుకోవాలని మనసున్న వారు ఇలా ఇద్దరిని ఒకే వేదిక మీదకు తెస్తున్నాడు. www.thedeverakondafoundation.org ద్వారా డొనేషన్స్ వసూలు చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. నిత్యావసర సరుకులు లేక ఇబ్బంది పడుతున్న వారు ఆ వెబ్ సైట్ లో ఆడిగిన ఆధార్, ఫోన్ నంబర్ డీటైల్స్ ఇచ్చేస్తే వాళ్ళ టీమ్ కాల్ చేసి వివరాలు తెలుసుకుని వాళ్ళ సరుకులకు కావాల్సిన ఎమౌంట్ ను అందచేస్తారు. డైరెక్ట్ గా సూపర్ మార్కెట్ లకు ఈ ఫండ్ ట్రాన్స్ ఫర్ చేస్తారని తెలుస్తుంది. సాయం కోరుకునే వారు సాయం అందించే వారు కూడా దేవరకొండ ఫౌండేషన్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. అవసరం ఉన్న వారు మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు.