
లాక్ డౌన్ టైంలో అందరు హీరోయిన్స్ తమ అప్డేట్స్ తో అలరించగా అక్కినేని కోడలు సమంత మాత్రం సైలెంట్ గా ఉంది. కరోనా క్రైసిస్ ఛారిటీకి కూడా విరాళాలు అందించలేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఈమధ్య అసలు కనిపించడం లేదు. లాక్ డౌన్ టైంలో చైతు, సమంత ఇద్దరు ఇంట్లోనే ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే ఈ స్టార్స్ ఇద్దరు ఈ లాక్ డౌన్ టైంలో బుక్స్ చదవడం, మ్యూజిక్ వినడంతో పాటుగా తమ పెట్ తో ఆటలాడుతున్నారు.
అయితే లేటెస్ట్ గా ఈ ఇద్దరు దిగిన క్రేజీ సెల్ఫీ ఒకటి బయటకు వచ్చింది. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సమంత ఫైనల్ గా చైతూతో రొమాంటిక్ సెల్ఫీ షేర్ చేసింది. కెరియర్ లో మంచి ఫామ్ లో ఉన్న చైతు ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పరశురామ్ డైరక్షన్ లో ఒక సినిమా చేయాల్సి ఉండగా అది క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది.