
కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన సినిమా ఆరెక్స్ 100. మొదటి సినిమాతోనే యూత్ పల్స్ పట్టేసిన డైరక్టర్ అజయ్ తన నెక్స్ట్ సినిమా మహా సముద్రం త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. శర్వానంద్, సాయి పల్లవి జోడిగా నటించనున్న ఈ సినిమా తర్వాత మరోసారి ఆరెక్స్ 100 లాంటి కథ సినిమాగా తీస్తాడట అజయ్ భూపతి. ఆరెక్స్ 100 సీక్వల్ గానే ఈ కథ నడుస్తుందని తెలుస్తుంది.
ఈ సీక్వల్ లో కూడా కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో, హీరోయిన్స్ గా నటిస్తారని తెలుస్తుంది. లాక్ డౌన్ టైం లో ఆరెక్స్ 100 సీక్వల్ కథ పూర్తి చేశాడట అజయ్ భూపతి. ఎలాంటి అంచనాలు లేవు కాబట్టి ఆరెక్స్ 100 ప్రేక్షకులను అలరించింది మరి ఆరెక్స్ 100 సీక్వల్ అనగానే అంచనాలు ఉంటాయి. వాటికి తగినట్టుగానే సినిమా ఉంటుందో లేదో చూడాలి. ఆరెక్స్ 100 తో ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ హీరోగా, విలన్ గా ఎలాంటి ఛాన్స్ వచ్చినా సరే చేస్తున్నాడు.