పుష్ప కోసం భారీ డిమాండ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో క్రేజీ మూవీగా వస్తున్న పుష్ప సినిమా ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెంచేశారు. అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో సర్ ప్రయిజ్ చేసిన పుష్ప ఐదు భాషల్లో రిలీజ్ అంటూ షాక్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో విలన్ గా కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తాడని అన్నారు. అయితే  ఈ సినిమాలో విలన్ గా భారీగా డిమాండ్ చేశాడట విజయ్ సేతుపతి. తమిళంలో సూపర్ ఫామ్ లో ఉన్న విజయ్ సేతుపతి పాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్న సినిమా విలన్ అనగానే సినిమాపై అంచనాలు పెరిగాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం పుష్ప కోసం విజయ్ సేతుపతి దాదాపు 10 కోట్ల దాకా రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడట. 

విలన్ కోసం అంత బడ్జెట్ పెట్టడం ఎందుకని విజయ్ స్థానంలో బాలీవుడ్ విలన్ ను తెచ్చే ఆలోచనలో ఉన్నారట పుష్ప టీం. పాన్ ఇండియా మూవీ కాబట్టి సినిమాలో సౌత్ లో అన్ని భాషల నటులకు ఛాన్స్ ఇచ్చే ఆలోచన లో ఉన్నాడట సుకుమార్. ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కలిసి చేస్తున్న ఈ పుష్పతో సంచలనం సృష్టించాలని చూస్తున్నారు. రంగస్థలంతో సూపర్ హిట్ అందుకున్న సుకుమార్ పుష్పతో మరో సెన్సేషన్ కు పర్ఫెక్ట్ స్కెచ్ వేశాడని చెప్పొచ్చు.