
ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు దర్శకులను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. అందులో సాహో డైరక్టర్ సుజిత్ కూడా ఉన్నాడు. మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ ను సుజిత్ చేతుల్లో పెట్టె ఆలోచనలో ఉన్నారట. మలయాళంలో సూపర్ హిట్టైన ఈ సినిమాలో మోహన్ లాల్ అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమా తెలుగు వర్షన్ పనులు మొదలుపెట్టారని తెలుస్తుంది. అయితే సినిమా కథను తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్చేస్తున్నారట.
మెగాస్టార్ చిరంజీవి కోసం కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కథలో యాడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సుజిత్ ప్రస్తుతం ఆ పనిలో నిమగ్నమయ్యాడని అంటున్నారు. సాహో సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకున్నా డైరక్టర్ గా సుజిత్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ టాలెంట్ మెచ్చే మెగాస్టార్ పిలిచి మరి అవకాశం ఇచ్చాడు. సాహోతో ప్రతిభ చాటిన సుజిత్ లూసిఫర్ రీమేక్ తో కమర్షియల్ గా కూడా హిట్టు కొడతాడో లేదో చూడాలి.