'ఆచార్య'లో మెగా డాటర్

మెగా ఫ్యామిలీ నుండి చాలామంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్ గా తెరంగేట్రం చేసి షాక్ ఇచ్చింది మెగా డాటర్ నిహారిక. నాగబాబు తనయురాలిగా ఒక మనసు సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలు చేసింది. అయితే మూడు సినిమాలు చేసినా అందులో ఒకటి కూడా కమర్షియల్ హిట్ అందుకోలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో చిన్న పాత్రలో అలరించిన నిహారిక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా స్పెషల్ రోల్ చేస్తుందని తెలుస్తుంది. 

మెగా ఫ్యాన్స్ ను సర్ ప్రయిజ్ చేసేలా ఆచార్య సినిమాని క్రేజీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడనిన్ తెలిసిందే. సినిమాలో నిహారిక కూడా చిన్న పాత్రలో కనిపిస్తుందట. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ కు సిస్టర్ రోల్ లో నిహారిక కనిపిస్తుందని టాక్. అంతేకాదు సినిమాలో ఇంకా చాలా సర్ ప్రయిజ్ లు కూడా ఉంటాయని తెలుస్తుంది.