మరో బయోపిక్ లో కీర్తి సురేష్..!

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మళయాళ భామ కీర్తి సురేష్ మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకుంది. ఆ సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత తమిళ సినిమాల్లో బిజీ అయ్యింది. తెలుగులో మిస్ ఇండియా సినిమా చేస్తున్న కీర్తి సురేష్ ఆ సినిమాతో పాటుగా నితిన్ రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ మరో బయోపిక్ లో నటిస్తుందని అంటున్నారు. 

తెలుగు కథానాయిక, దర్శకురాలు, నిర్మాత విజయ నిర్మల జీవిత కథతో ఒక సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ నటిస్తుందని అంటున్నారు. విజయ నిర్మాతల తనయుడు నరేష్ ఈ సినిమా నిర్మిస్తున్నారని ఫిలిం నగర్ టాక్. మహానటి తర్వాత కీర్తి చేయబోతున్న ఈ బయోపిక్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈబయోపిక్ కు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ బయటకు రావాల్సి ఉంది.