
రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తెలిసిందే. ఈ సినిమాను అసలైతే ముందు ఈ ఇయర్ అనుకున్నా 2021 జనవరి 8కి వాయిదా వేశారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి సినిమా మరోసారి వాయిదా పడేలా ఉందని అంటున్నారు. సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇద్దరు రియల్ లైఫ్ సూపర్ హీరోస్ కథను తీసుకుని దానికి కొంత కల్పిత కథను యాడ్ చేసి ఈ సినిమా తీస్తున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరోసారి త్రివిక్రమ్ డైరక్షన్ లో చేస్తున్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో అరవింద సమేత సినిమా వచ్చింది. ఇక ఈ కాంబోలో రాబోతున్న సెకండ్ మూవీ త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందట. ఈ సినిమా కథ కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా కియరా, పూజా హెగ్డే వంటి హీరోయిన్స్ పేర్లు వినపడ్డాయా ఫైనల్ గా ఈ మూవీలో శృతి హాసన్ ను ఫిక్స్ చేశారని తెలుస్తుంది. కొద్దిపాటి గ్యాప్ తర్వాత శృతి హాసన్ తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది. ఈ ప్రస్తుతం రవితేజ క్రాక్ సినిమా చేస్తున్న శృతి హాసన్ పవర్ స్టార్ తో వకీల్ సాబ్ సినిమాలో కూడా జోడీ కడుతుందని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ సినిమా ఛాన్స్ కూడా అందుకుంటే మళ్ళీ అమ్మడి కెరియర్ జోరు అందుకున్నట్టే అని చెప్పొచ్చు.