మహేష్ కోసం మొదలు పెట్టారట..!

ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి డైరక్షన్ లో మహేష్ సినిమా కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమాను కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ తోనే సినిమా చేస్తానని అఫీషియల్ గా చెప్పారు. ఇక ఈ సినిమాకు సంబందించిన కథ మొదలుపెట్టారట రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. మహేష్ ఆల్రెడీ లైన్ ఓకే చేయగా ఫుల్ స్క్రిప్ట్ రాసేందుకు సిద్ధమవుతున్నారట. 

ఇక ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. జామ్స్ బాండ్ తరహా కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ పూర్తి కావడమే ఆలస్యం వెంటనే రాజమౌళి, మహేష్ సినిమా మొదలుపెడతారని తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్ పరశురామ్ డైరక్షన్ లో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని తెలుస్తుంది. పరశురామ్ సినిమా తర్వాత మహేష్ జక్కన్నతో సినిమా చేస్తాడు.