మెగా లేడీస్.. మేకప్, నో మేకప్ ఛాలెంజ్..!

ఓ పక్క బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ తో టాలీవుడ్ ట్రెండింగ్ లో ఉండగా లేటెస్ట్ గా మెగా లేడీస్ అంతా కలిసి మేకప్, నో మేకప్ తో లాక్ డౌన్ లేడీస్ అంటూ ఒక స్పెషల్ వీడియో షేర్ చేశారు. ఈ టాస్క్ లో మెగా డాటర్స్ సుస్మిత, శ్రీజ, నిహారికలతో పాటుగా అల్లు అర్జున్ వైఫ్ స్నేహా కూడా పాల్గొన్నారు. మేకప్, నో మేకప్ తో వీళ్ళు చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా డాటర్ సుస్మిత ఇప్పటికే కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తుంది. 

సైరా నరసింహా రెడ్డి సినిమాకు సుస్మిత కాస్ట్యూమర్ గా పనిచేశారు. ఇప్పుడు కొత్తగా మేకప్ మెన్ గా కూడా చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. మెగా లేడీస్ ఈ లాక్ డౌన్ టైం లో చేస్తున్న ఈ హడావిడి మెగా ఫ్యాన్స్ ను అలరిస్తుంది. అయితే వీడియోలో అల్లు అర్జున్ భార్య వేసిన గ్రేసీ స్టెప్ మాత్రం స్పెషల్ గా ఆకట్టుకుంది. మెగా డాటర్స్ తో పాటుగా మిగతా మెగా ఫ్యామిలీ లేడీస్ అంతా కలిసి చేసిన ఈ వీడియో చూసి మెగా ఫ్యాన్స్ సూపర్ అనేస్తున్నారు.