'జాను' అక్కడ హిట్

కోలీవుడ్ లో సూపర్ హిట్టైన 96 మూవీని తెలుగులో రీమేక్ చేశారు దిల్ రాజు. అక్కడ ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ ను మాత్రం అలరించలేదు. 96 రీమేక్ జాను ఇక్కడ కమర్షియల్ హిట్ అందుకోలేదు. శర్వానంద్, సమంత కలిసి నటించిన ఈ సినిమాను మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై హిట్ కాకున్నా స్మాల్ స్క్రీన్ పై మాత్రం సూపర్ హిట్ అందుకుంది. 

లాక్ డౌన్ టైం లో స్టార్ మాలో లాస్ట్ సండే టెలికాస్ట్ అయ్యింది జాను. ఎలాగు సినిమాలు, టివి షోలు కూడా ఏవి రాకపోవడంతో అందరు జానునీ ఎంజాయ్ చేశారు. అందుకే జాముకి హయ్యెస్ట్ గ 7. 6 టి.ఆర్.పి రేటింగ్స్ వచ్చాయి. ప్రస్తుతం లాక్ డౌన్ టైం లో ఈటివి న్యూస్ అత్యధిక టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకోగా జాను సెకండ్ ప్లేస్ లో ఉంది. అంతేకాదు బుల్లితెర ఆడియెన్స్ జాను సినిమాను ఇష్టపడ్డారు. వెండితెర మీద సక్సెస్ కాకున్నా స్మాల్ స్క్రీన్ పై జాను హిట్ కొట్టినట్టే లెక్క.