
లాక్ డౌన్ టైం లో స్టార్స్ అంతా ఛాలెంజ్ లతో టైం పాస్ చేస్తున్నారు. తమలోని రియల్ మ్యాన్ ను బయటకు తీస్తున్నారు.. అదేనండి ప్రపంచానికి చూపిస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్న బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ వైరల్ గా మారింది. చైన్ లింక్ ప్రాసెస్ లో ఈ ఛాలెంజ్ కొనసాగుతుంది. రాజమౌళి టాస్క్ పూర్తి చేసి తన ఇద్దరి హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు ఇచ్చాడు. వారితో పాటుగా కీరవాణికి బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ విసిరాడు. తమ్ముడు ఛాలెంజ్ చేస్తే అన్న చేయకుండా ఉంటాడా.. కీరవాణి ఆ టాస్క్ పూర్తి చేసి థమన్, డైరక్టర్ క్రిష్ లను ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేశాడు.
డైరక్టర్ క్రిష్ కూడా కీరవాణి ఇచ్చిన ఛాలెంజ్ ను పూర్తి చేశాడు. అయితే క్రిష్ ఎవరికీ ఈ ఛాలెంజ్ విసిరాడో తెలుసా.. ప్రపంచంలో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి ఈ ఛాలెంజ్ ట్రాన్స్ ఫర్ చేశాడు. పి.కె ఫ్యాన్స్ కు అందరికి ఈ ఛాలెంజ్.. ఇంట్లో వాళ్లకు సహాయ పడదాం అని అన్నారు క్రిష్. ప్రస్తుతం పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ తర్వాత పవర్ స్టార్ తో క్రిష్ సినిమా ఉంటుంది. ఇప్పటికే ముహూర్త కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత సెట్స్ మీదకు వెళ్లనుంది. పవన్ తో సినిమా చేయడానికి ముందే క్రిష్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేయడం విశేషం.
Here you go @mmkeeravaani sir .. and I'm nominating each n every #PSPKFan all over the world for the #BeTheRealMan challenge in helping our women in household chores. pic.twitter.com/5tXi1i7lQP