
రంగస్థలం తర్వాత సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా పుష్ప. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఐదు భాషల్లో పుష్ప రిలీజ్ అని షాక్ ఇచ్చిన బన్నీ, సుకుమార్ ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తమ సత్తా చాటాలని ఫిక్స్ అయ్యారు. ఆర్య, ఆర్య 2 తర్వాత సుక్కు, బన్ని కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప. మూవీలో ఇప్పటికే రష్మిక మందన్న ఒక హీరోయిన్ అని తెలుస్తుండగా సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉంటుందని టాక్. ఇక ఆ సెకండ్ ఫీమేల్ లీడ్ ఛాన్స్ మళయాళ భామ నివేద థామస్ అందుకుంది అంటున్నారు.
నాని జెంటిల్ మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా నివేద థామస్ అల్లు అర్జున్ పుష్పలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందట. సినిమాలో ఆమె పుష్పకు లవర్ గా కనిపిస్తుందనని తెలుస్తుంది. సినిమాలో ఆమె పాత్ర కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్, బన్ని, దేవి కలిస్తే ఎలా ఉంటుందో తెలిసిందే. సినిమా మ్యూజిక్ పరంగా కూడా సెన్సేషన్ అయ్యేలా ముగ్గురు ప్లాన్ చేస్తున్నారట. మరి పుష్ప క్రేజీ అప్డేట్స్ అల్లు ఆర్మీతో పాటుగా మెగా ఫ్యాన్స్ ను సర్ ప్రయిజ్ అయ్యేలా చేస్తున్నాయి.