మేజర్ అదిరిపోతోంది : అడివి శేష్

26/11 ముంబై ఎటాక్ నేపథ్యంలో వస్తున్న సినిమా మేజర్. ఈ సినిమాలో సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ కనిపించనున్నారు. గూఢచారి డైరకర్ శశికిరణ్ తిక్కా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ నిర్మిస్తున్న ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మేజర్ సినిమాపై అడివి శేష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సినిమాలో చాలా సర్ ప్రయిజ్ లు ఉన్నాయని.. అవి ఆడియెన్స్ కు నచ్చుతాయని అంటున్నాడు.            

కెరియర్ మొదట్లో తన ప్రయోగాలు ప్రేక్షకులకు నచ్చకపోయినా తన ప్రయత్నాన్ని ఆపకుండా చేసి క్షణం నుండి అతన్ని ఫాలో అయ్యేలా చేశాడు అడివి శేష్. గూఢచారి, ఎవరు లాంటి డిఫరెంట్ సినిమాలు చేసి హిట్ అందుకున్న అడివి శేష్ ప్రస్తుతం మేజర్ తో పాటుగా గూఢచారి 2 లో కూడా నటిస్తున్నాడు. మేజర్ సినిమా దాదాపు పూర్తి కాగా గూఢచారి సినిమా ఇంకాస్త షూటింగ్ చేయాల్సి ఉందట. మొత్తానికి యువ హీరో తన ప్రయోగాలతో తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాడు. మహేష్ నిర్మిస్తున్నాడు కాబట్టి మేజర్ కు మంచి హైప్ వచ్చే ఛాన్స్ ఉంది.