ఉప్పెన తమిళ రీమేక్.. స్టార్ వారసుడి కన్ను..!

మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్మడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీగా వస్తున్న ఉప్పెన త్వరలో రిలీజ్ కానుంది. సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు దేవ్ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సినిమా నుండి రిలీజైన రెండు పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమా అవుట్ ఫుట్ చూసి ఉప్పెనను తమిళంలో రీమేక్ చేయాలని చూస్తున్నాడు విజయ్ సేతుపతి.

ఇప్పటికే తమిళ రీమేక్ రైట్స్ డీల్ సెట్ చేశారని తెలుస్తుంది. ఇక్కడ మరో క్రేజీ న్యూస్ ఏంటంటే ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తనయుడు సంజయ్ తో తీసే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. స్టార్ వారసుడి డెబ్యూ మూవీగా ప్లాన్ చేస్తున్నారు అంటే ఉప్పెన ఇక్కడ పక్కా హిట్ అని చెప్పొచ్చు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల జోడీ అలరించేలా ఉంది.