హిట్ డైరక్టర్ కు మరో ఛాన్స్..!

టాలెంట్ ఉన్న వారికి అవకాశం ఇవ్వడంలో ముందుండే వారిలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ఇప్పటికే తన సినిమాల ద్వారా ఎంతోమంది కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చిన నాని ఈమధ్య నిర్మాతగా మారి కూడా న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నాడు. నాని నిర్మాతగా చేసిన మొదటి సినిమా అ! హిట్ అయ్యింది. నాని నిర్మించిన సెకండ్ మూవీ హిట్. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. శైలేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో డైరక్టర్ ప్రతిభ చూసిన నాని.. అతని డైరక్షన్ లో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వస్తున్న వి సినిమా రిలీజ్ కు రెడీ అయింది. 

ఇక శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న టక్ జగదీశ్ సెట్స్ మీద ఉంది. ఆ సినిమా తర్వాత హిట్ డైరక్టర్ శైలేష్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని అంటున్నారు. హిట్ తో మొదటి సినిమా అయినా తన టాలెంట్ చూపిన శైలేష్ ఈసారి నానితో మరో డిఫరెంట్ సబ్జెక్ట్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. మరి నాని చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.