ఆ సినిమా చూస్తూ నిద్రపోయా : రాజమౌళి

92వ ఆస్కార్ అవార్డుల్లో 4 అవార్డులను కైవసం చేసుకున్న కొరియన్ మూవీ పారసైట్ ను చూసిన రాజమౌళి, తనకు ఆ సినిమా పెద్దగా నచ్చలేదని అన్నారు. అంతేకాదు ఆ సినిమా చూస్తూ మధ్యలో నిద్రపోయా అనడం షాకింగ్ గా మారింది. అకాడమీ అవార్డు గెలుచుకున్న పారసైట్ సినిమా గురించి రాజమౌళి చేసిన కామెంట్ ఇప్పుడు హాట్ న్యూస్ గా మారాయి. అయితే ఏ సినిమా గురించి అయినా ఎవరైనా సరే తమ అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పు లేదు. పారసైట్ తనకు నచ్చలేదన్న రాజమౌళిని టార్గెట్ చేస్తున్నారు కొందరు ట్రోలర్స్. 

నీ సినిమాల్లో కూడా కొన్ని మాకు నచ్చలేదు అయినా మేము చూడలేదా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అకాడమీ సినిమా మీద రాజమౌళి తన అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం మనకు ఉంది. కొన్ని సినిమాలు కొందరికి నచ్చుతాయి కొన్ని నచ్చవు.. రాజమౌళికి పారసైట్ తన అంచనాలకు తగినట్టు లేదని చెప్పడం పెద్ద విషయం కాదు అని కొందరు అంటున్నారు. బాంగ్ జూన్ హోం డైరెక్ట్ చేసిన పారసైట్ సినిమా 92వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ మూవీగా నిలిచింది.