
కరోనా పై అవగాహన కలిగించేందుకు స్టార్స్ అంతా తమకు తోచిన విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే మనం ఇళ్ల దగ్గరే సేఫ్ గా ఉండాలని కొందరు స్టార్స్ తమ పాటలతో సూచించారు. లేటెస్ట్ గా బిగ్ బాస్ 2 కంటెస్టెంట్స్ అంతా కలిసి ఒక స్పెషల్ సాంగ్ చేశారు. ర్యాపర్ రోల్ రైడా రాసి పాడిన ఈ సాంగ్ లో బిగ్ బాస్ 2 కంటెస్టెంట్స్ అంతా పాల్గొన్నారు.
ఈ సాంగ్ ను తనీష్ డైరెక్ట్ చేయడం విశేషం. అయితే బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ మాత్రం ఈ వీడియోలో కనిపించలేదు. హౌజ్ నుండి బయటకు వచ్చాక కూడా కౌశల్ బిగ్ బాస్ 2 కంటెస్టెంట్స్ తో దూరంగా ఉంటున్నాడని తెలిసిందే. ఫైనల్ గా కరోనా మీద అవగాహన కోసం బిగ్ బాస్ 2 కంటెస్టెంట్స్ చేసిన ఈ బోర్ కొడుతోంది సాంగ్ కూడా అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.