
టాలీవుడ్ స్టార్స్ లాక్ డౌన్ టైం లో ఇంటి పనులు చేస్తున్నారు. బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ లో భాగంగా తారక్ ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసి చూపించాడు మెగాస్టార్ చిరంజీవి. ఇంటిని శుభ్రం చేయడమే కాకుండా అదిరిపోయే ఉపమా దోశ వేసి తన తల్లికి తినిపించాడు. చిరు దోశ వేయడమే ఒక క్రేజీ థింగ్ అనుకుంటే ఆ దోశని పెనం పీడా తిరగేయడం అదిరిపోయింది. ఇక తాను చేసిన ఈ టాస్క్ ను కొనసాగించేలా కె.టి.ఆర్, రజినీకాంత్, డైరక్టర్ మణిరత్నంలకు ఛాలెంజ్ విసిరాడు.
ఇక తారక్ ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించిన విక్టరీ వెంకటేష్ కూడా తాను కూడా రియల్ మ్యాన్ గా ఇంటి పనులు చేస్తూ కనిపించాడు. వెంకీ కూడా ఇంటి పనులు చేసి, పెరడులో మొక్కలకు నీళ్లు పోసి, వంట చేస్తూ కనిపించాడు. ఫైనల్ గా ఐయామ్ దట్ అనే బుక్ చదువుతూ కనిపించాడు. వెంకటేష్ ఈ ఛాలెంజ్ లో భాగమవ్వాలని చిన్నోడు మహేష్, కోబ్రా వరుణ్ తేజ్, డైరక్టర్ అనీల్ రావిపూడికి ఛాలెంజ్ విసిరాడు. మరి నెక్స్ట్ మహేష్ ఎలాంటి వీడియోతో సర్ ప్రయిజ్ చేస్తాడో చూడాలి.
Here it is Bheem @tarak9999 నేను రోజు చేసే పనులే...ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం. And I now nominate @KTRTRS & my friend @rajinikanth #BeTheRealMan challenge. pic.twitter.com/y6DCQfWMMm