మలయాళ రీమేక్.. బాలయ్య కష్టమే..!

రీసెంట్ గా మలయాళంలో సూపర్ హిట్ అందుకున్న సినిమా అయ్యప్పనుం కోషియం. సాచి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పృథ్వి రాజ్ సుకుమారన్, బిజీ మీనన్ నటించారు. పృథ్వి రాజ్, బిజీ మీనన్ ఇద్దరు నువ్వా నేనా అనేలా తమ నటనతో ఆకట్టుకున్నారు. లవ్ స్టోరీలు, డ్యూయెట్లు, గ్రూప్ సాంగ్స్ లాంటివేమీ లేకుండా కేవలం ఒక బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తో సినిమా మొత్తం నడిపించాడు దర్శకుడు సాచి. 

ఇక ఈ సినిమా హిట్ కొట్టగానే టాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను దాని మీద పడ్డది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ కొనేశారని తెలుస్తుంది. ఫిలిం నగర్ టాక్ ప్రకారం ఈ సినిమాలో బాలకృష్ణ, రానా నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే సినిమా చూసిన కొందరు తెలుగు ప్రేక్షకులు మాత్రం బాలయ్య ఆ రోల్  చేయడం కష్టమే అంటున్నారు. ఏంటి బాలకృష్ణ చేయలేని పాత్రా అది అనుకోవచ్చు. అది కొద్దిగా మాస్ లుక్ లో.. చాలావరకు సైలెంట్ గా ఉండే పాత్ర మరి ఆ పాత్ర బాలకృష్ణ చేయడం నందమూరి ఫ్యాన్స్ ను మెప్పించాడు. అయితే పృథ్వి రాజ్ పాత్రలో రానా మాత్రం బాగా సూట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ రీమేక్ చేస్తే ఎవరు చేస్తారు.. ఏ డైరక్టర్ దీన్ని డైరెక్ట్ చేస్తారో తెలియాల్సి ఉంది.