
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగులోనే కాదు తమిళ, హిందీ, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. బాలీవుడ్ మోడల్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ డాన్ కొడుకుగా కనిపిస్తాడని తెలుస్తుంది. సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపిస్తాడట. అయితే తండ్రి డాన్ గా ఉంటే అతను చేసే పనులు ఇష్టం లేక తండ్రికి దూరంగా ఉంటాడట. ఒకదశలో తన తండ్రితో చేసే వ్యక్తులతోనే తనకు శత్రుత్వం ఏర్పడుతుందట.. దాన్ని ఎలా ఫేస్ చేశాడు అన్నదే ఫైటర్ సినిమా కథ అని తెలుస్తుంది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్, స్టైల్ అంతా కొత్తగా ఉంటాయని తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ ట్రాక్ ఎక్కినా పూరి విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు. డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ చేస్తున్న ఫైటర్ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. సినిమా ఇప్పటివరకు జరిగిన షూటింగ్ అంతా బాగా వచ్చిందని తెలుస్తుంది.