రియల్ మ్యాన్ అనిపించుకున్న స్టార్స్..!

లాక్ డౌన్  టైం లో స్టార్స్ అంతా తమ ఇళ్లల్లో ఉంటూ తమలోని టాలెంట్ బయట పెడుతున్నారు. ఇప్పటికే రకరకాల డిష్ లతో తమలోని కొత్త టాలెంట్ చూపిన స్టార్స్ ఇప్పుడు కొత్తగా బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగ మొదలుపెట్టిన ఈ బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్.. రాజమౌళిని మొదట నామినేట్ చేశాడు. రాజమౌళి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి లను నామినేట్ చేశాడు. 

కత్తిపట్టి వీర యోధులుగా కనిపించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా చీపురు చేత పట్టి ఇంటిని శుభ్రం చేశారు. అదొక్కటే కాదు ఇల్లు తుడిచి.. చెట్లకు నీళ్లు పోసి ఇంటి పనుల్లో సాయపడ్డారు. ఎన్టీఆర్ టాస్క్ పూర్తి చేసి చిరంజీవి బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లకు ఛాలెంజ్ విసిరాడు. చరణ్ కూడా జక్కన్న ఇచ్చిన టాస్క్ పూర్తి చేసి శర్వానంద్, రన్ వీర్ సింగ్ లకు ఛాలెంజ్ చేశాడు. తారక్ ఛాలెంజ్ స్వీకరించిన వెంకటేష్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి వెయిటింగ్ ఫర్ గ్యాంగ్ లీడర్ వీడియో అని రిప్లై ఇచ్చాడు. వెంకీమామ మెసేజ్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.