
కమెడియన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న శ్రీనివాస్ రెడ్డి హీరోగా కూడా మారి సినిమా చేశాడు. ఇక మొదటిసారిగా దర్శక నిర్మాతగా కూడా మారి ఒక సినిమా చేశాడు. శ్రీనివాస్ రెడ్డి నటించి తెరకెక్కించిన సినిమా భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు. ఈ సినిమా కథ బాగా నచ్చడంతో తానే సినిమాను డైరెక్ట్ చేసి నిర్మించానని అన్నారు శ్రీనివాస రెడ్డి. అయితే ఈ సినిమా ఆడకపోవడంతో తను ఆర్ధికంగా నష్టపోయానని అంటున్నారు శ్రీనివాస్ రెడ్డి.
వరుస సినిమాలతో సక్సెస్ ట్రాక్ లో ఉన్న శ్రీనివాస్ రెడ్డి నిర్మాతగా, డైరక్టర్ గా రెండు బాధ్యతలను ఒకేసారి మీద వేసుకుని చేతులు కాల్చుకున్నాడు. హీరోగా మారిన కమెడియన్లు కామెడీ పాత్రలు చేయరు మీరు అలానే చేస్తారా అంటే.. తాను హీరోగా చేసినా కమెడియన్ గా పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానని అంటున్నాడు శ్రీనివాస్ రెడ్డి. ఆల్రెడీ సునీల్ కేవలం హీరోగా మాత్రమే చేస్తానని చెప్పి కెరియర్ లో చాలా వెనుకపడ్డాడు. అందుకే శ్రీనివాస్ రెడ్డి మాత్రం అలాంటి తప్పు చేయనని చెబుతున్నాడు. ఇన్నాళ్లు సంపాదించిన మొత్తాన్ని సినిమా నిర్మించి పోగొట్టుకున్నాడు శ్రీనివాస్ రెడ్డి. సినిమాలో నటించినంత మాత్రాన సినిమా తీయడం ఈజీనే అనుకోవడం ఎంత పెద్ద పొరపాటో ఈ ఫెయిల్యూర్స్ చూస్తే అర్ధమవుతుంది.