
ఆఫ్టర్ మ్యారేజ్ సమంత కథల విషయంలో చాలా జాగ్రత్త పడుతుంది. లాస్ట్ ఇయర్ మజిలీ, ఓ బేబీ సినిమాలతో హిట్ అందుకున్న సమంత ఈ ఇయర్ చేసిన జాను సినిమాతో నిరాశపరిచింది. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవలేదు కానీ సినిమా సామ్ లవర్స్ కు నచ్చేసింది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత కలిసి విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో సినిమా చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరిస్ లో కూడా నటిస్తుంది. అయితే లేటెస్ట్ గా కన్నడలో సూపర్ హిట్ అయిన ఒక సినిమా మీద సమంత కన్ను పడ్డదని తెలుస్తుంది.
కన్నడలో సూపర్ హిట్ అయినా దియా సినిమా మీద సమంత ఇంట్రెస్ట్ చూపిస్తుందట. కె. ఎస్ అశోక డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పృథ్వి అంబర్, దీక్షిత్, ఖుషి లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా కథ, కథనాలు ఆకట్టుకున్నాయి. అందుకే సమంత ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తుందట. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాను సమంత సొంత బ్యానర్ లో తెరకెక్కించాలని అనుకుంటుందట. మరి దియా సమంత ఎలా ఉటుంది.. కన్నడ యూటర్న్ రీమేక్ తో సక్సెస్ అందుకున్న సామ్ ఈ రీమేక్ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.