పుష్పలో ఒకరు కాదు ఇద్దరా..?

సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉందని అంటున్నారు. రష్మికతో పాటుగా మలయాళ భామ నివేదా థామస్ కూడా ఈ సినిమాలో అవకాశం దక్కించుకుందట. నాని జెంటిల్ మెన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నివేదా థామస్ ఆ తర్వాత నిన్నుకోరి, జైలవ కుశ, బ్రోచేవారెవరురా సినిమాల్లో నటించింది. 

తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న ఈ అమ్మడు అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్పలో ఒక స్పెషల్ రోల్ చేస్తుందని అంటున్నారు. నివేదా రోల్ హీరోయిన్ రష్మికకు ఈక్వల్ గా ఉంటుందని  టాక్. కన్నడ భామ రష్మిక వరుస స్టార్ ఛాన్సులతో అదరగొడుతుంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. రష్మికతో పాటుగా నివేదా థామస్ కూడా నేషనల్ లెవల్ లో క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది.