
సైరా నరసింహారెడ్డి తర్వాత చిరు చేస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా స్పెషల్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రెజీనా ఐటం సాంగ్ తో అలరిస్తుందని తెలుస్తుంది. అనుకున్న విధంగా షూటింగ్ జరిగితే ఈ ఇయర్ దసరాకి సినిమా రిలీజ్ అంటున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి.
ఆచార్య తర్వాత చిరు తను నటించే మూడు సినిమాల దర్శకులను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. సాహో డైరెక్టర్ సుజిత్, బాబీ, మెహెర్ రమేష్ ఈ ముగ్గురితో చిరంజీవి సినిమాలు చేస్తాడని తెలుస్తుంది. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కోసం సుజిత్, బాబీ చెప్పిన కథ నచ్చడంతో అతనితో, మెగా ఫ్యామిలీ డైరెక్టర్ అయిన మెహెర్ రమేష్ కు మెగాస్టార్ ఛాన్స్ ఇస్తాడని అంటున్నారు. అదే జరిగితే చిరు సినిమాలతో ఈ ముగ్గురి దశ తిరిగినట్టే.