చీపురు పట్టిన రాజమౌళి..!

ఎంత పెద్ద స్టార్ డైరక్టర్ అయినా ఇంట్లో తన పని తానూ చేసుకోవాల్సిందే. అంతేకాదు ప్రస్తుతం ఈ లాక్ డౌన్ టైం లో ఇంట్లో పనిలో కూడా హెల్ప్ చేస్తే బెటర్. ఇలాంటి టైం లో అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగ బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ విసిరాడు. ఈ ఛాలెంజ్ సవీకరించే వారు ఇంట్లో పని చేయాల్సి ఉంటుంది. అయితే సందీప్ వంగ ఛాలెంజ్ ను స్వీకరించిన రాజమౌళి రియల్ గా మ్యాన్ గా ఇంట్లో చెత్తని ఊడుస్తూ కనిపించాడు. 

ఒక చేతిలో చీపురు మరో చేతిలో చేట ఈ రెండింటితో ఇంటిని శుభ్రం చేస్తున్న రాజమౌళి వీడియో షేర్ చేశాడు. అంతేకాదు బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ లో పాల్గొన్నాలని రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు ఛాలెంజ్ విసిరాడు. హీరోలిద్దరితో పాటుగా బాహుబలి నిర్మాత శోభుతో పాటుగా స్టార్ డైరక్టర్ సుకుమార్ కు ఈ ఛాలెంజ్ విసిరాడు రాజమౌళి. అయితే రాజమౌళి ఇలా ట్యాగ్ చేశాడో లేదో ఛాలెంజ్ యాక్సెప్టెడ్ జక్కన్న అంటూ రిప్లై ఇచ్చాడు తారక్. సో త్వరలోనే ఎన్టీఆర్ ఇంటిని శుభ్రం చేసే వీడియో బయటకు వస్తుందన్నమాట.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి.